అన్నమాచార్య సందర్శించిన

సంబటూరు క్షేత్రము

 

శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానము

స్థల పురాణం

కడప జిల్లా కమలాపురం మండలం, సంబాటూరు గ్రామం నందు వెలసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం మహా పుణ్య క్షేత్రం గా ప్రసిద్ది చెందింది. మహాభారత కాలం నాటి అభిమాన్యుని మనవడైన జనమేజయ మహారాజు ఈ ఆలయాన్ని సందర్శించినట్లు స్థల పురాణం  చెబుతుంది. కాలయానం లో ఈ దేవాలయం వివిధ రకాలు గా తన రూపు రేఖలను మార్చుకుంటూ పునరుద్ధరణ జరుగుతూ వచ్చినది.

పినాకిని నదీతేరే  చోళరాజాజ్ఞ ప్రతిష్టితం

చ్యవన స్యాశ్రమే రమ్యే  కేశవాఖ్య ఇతి స్మృతం। ।

చోళ రాజు కాలం లో కూడా ఈ దేవాలయం పునరుద్దరణ మరియు విగ్రహ పునఃప్రతిష్టించినట్లు తెలుస్తోంది. ఈ సంబాటూరు పూర్వం చ్యమన మహర్షి అందమైన ప్రాంతం అని తెలుస్తోంది. ఈ గ్రామమునకు శ్రీ భాష్యపుర అనే మరొక పేరు కూడా కలదు.

దాదాపు 550 సంవత్సరాల క్రితం ఈ ఆలయ వైభవం గురించి శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు ఈ పుణ్య క్షేత్రాన్ని దర్శించి పలు కీర్తనలు రచించారు.

ఉదాహరణకు:  “చక్కటి ఈ వెన్నుడు సంబాటూరు చెన్నుడు “

విజయనగర ప్రభువైన శ్రీ సదాశివ దేవరాయలకు సంతానం లేక బాధ పడుతున్నప్పుడు ఒకరోజు చెన్నకేశవస్వామి రాజుకు కలలో కనిపించి సంబటూరు గ్రామంలో వెలసిన నా దేవాలయాన్ని పునర్నిర్మాణం చేస్తే మీకు సంతానం కలుగుతుంది అని స్వామి చెప్పగా 1473 వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని పునరుద్ధరణ చేసినట్లు శాసన ఆధారాలు ఉన్నాయి.  ఆనాటి నుండి దాదాపు 100  సంవత్సరాల క్రితం వరకు ఏడాదికి రెండు మార్లు మహా వైభవంగా ఉత్సవాలు జరుగుతూ ఉండేవి తర్వాత పూర్వపు వైభవాన్ని సంతరించుకుటకై  03-05-1992 నాడు తిరిగి ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠ జరిగింది.

1992 నుండి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి మహోత్సవాలు ఈనాటికీ ప్రతి సంవత్సరము వైశాఖ శుద్ధ తదియ నాడు (పుష్పగిరి తిరుణాల రోజు)  జరుగుతున్నవి) 543 సంవత్సరాల తర్వాత ఆలయ పునరుద్దరణ  పనులు 13 నవంబర్ 2015 నుండి ప్రారంభమై పనులు జరుగుచున్నవి.

ఆలయ శిల్పకళ

ఆలయ దర్శనం

మీగడ వేంకట మీడియా క్లిప్పింగ్

శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం

పనులు కొనసాగుతున్న విశేషాలు

శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం మహాభారత కాలం నాటి అభిమాన్యుని మనవడైన జనమేజయ మహారాజు ఈ ఆలయాన్ని సందర్శించినట్లు స్థల పురాణం  చెబుతుంది.